AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీఎస్ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్ర‌వేశాల నిమిత్తం నిర్వ‌హించే పాలీసెట్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో నిర్వహిస్తున్న పలు కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్‌ పరీక్షకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీని ద్వారా పాలిటెక్నిక్ ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది.10వ తరగతి పరీక్షలు పాసైన, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష కోరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిపికేషన్‌లో నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 22 వరకు సమయం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 250, ఇతరులు రూ. 500లతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రూ. 100 ఏప్రిల్ 24 ముందు ఆలస్య రుసుముతో రూ. 300 ఆలస్య రుసుము ఏప్రిల్ 26లోపు దరఖాస్తు చేసుకోవాలి. మే 17న పాలిసెట్ రాత పరీక్ష నిర్వహించనున్నారు.

ఇక ఈ పరీక్ష మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ఆఫ్ లైన్‌లో పరీక్ష నిర్వహించనుండగా.. మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో 150 ప్రశ్నలుంటాయి. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి మ్యాథ్స్‌–60, ఫిజిక్స్‌–30, కెమిస్ట్రీ–30, బయాలజీ నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. రెండున్నర గంటలు పరీక్ష సమయం ఉంటుంది. పదోతరగతి స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలుండగా.. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. పరీక్ష ముగిసిన 12 రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తారు.

ANN TOP 10