AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై నిజాలు బయటపెట్టిన కాగ్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాగ్ రిపోర్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్‌ను సిద్ధం చేసింది. డీపీఆర్‌లో రూ.63,352 కోట్లు చూపెట్టగా రూ.1,06,000 కోట్లకు అంచనా వ్యయం పెంచారని.. ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 1,47,427 కోట్లు ఖర్చు అవుతుందని.. ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువ చూపెట్టారని తెలిపింది. ప్రాజెక్టు వార్షిక ఖర్చు లు తక్కువ చూపారని వెల్లడించింది. కాళేశ్వరం నీటి అమ్మకం ద్వారా రూ.1019కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారని.. ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు తీసుకున్నట్లు కాగ్ రిపోర్టులో పేర్కొంది.

15 బ్యాంకులతో రూ. 87 వేల కోట్లు సమకూర్చుకోవాలని ఒప్పందం చేసుకున్నారని… బడ్జెటేతర రుణాలపై ప్రభుత్వం ఎక్కువ ఆధారపడి ఉందని తెలిపింది. రుణాలు చెల్లించడంలో కాలయాపన చేసిందని పేర్కొంది. ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రతీ సంవత్సరం రూ.700 కోట్ల నుంచి 14 వేల 5 వందల కోట్ల వరకు ఖర్చు అవుతుందని.. రుణాలు కట్టడం కోసం మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రిపోర్టులో వెల్లడించింది. కాళేశ్వరం అప్పు కట్టుకుంటూ పోతే 2036 లో పూర్తవుతుందని అంటూ కాగ్ నివేదికలో పేర్కొంది.

పంచాయతీ రాజ్ శాఖపై…
పంచాయతీ రాజ్ శాఖపై కాగ్ రిపోర్టు ఈ విధంగా ఉంది… ‘‘గ్రాంట్ల మళ్ళింపు జరిగింది. నిధుల దుర్వినియోగం జరిగింది. బకాయిలు వసూలు చేయలేకపోయారు. కొన్ని పనులకు అధిక బిల్లులు చెల్లించారు. సకాలంలో రికార్డులు సమర్పించలేదు’’ అంటూ కాగ్ రిపోర్టులో వెల్లడించింది.

ANN TOP 10