AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు.. రేణుక, అనిల్ కుమార్ యాదవ్ ల పేర్లు ఖరారు

తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. రాష్ట్రం నుంచి ఇద్దరు అభ్యర్థులను కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది. ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి, ఎం. అనిల్ కుమార్ యాదవ్ లకు రాజ్యసభ సీట్లను కేటాయించింది. ఈ మేరకు ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. మరోవైపు కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ లకు అవకాశం కల్పించింది. మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ పేరును ఖరారు. వీరి అభ్యర్థిత్వాలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారని ఏఐసీసీ తెలిపింది. మరోవైపు రేణుకా చౌదరి రాజ్యసభకు వెళ్తుండటంతో… ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఎవరికి దక్కుతుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.

ANN TOP 10