AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిరుద్యోగ యువకులకు అండగా ఉంటా : సీఎం రేవంత్‌

నిరుద్యోగులకు అండగా ఉంటూ సమస్యలను పరిష్కరిస్తాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. గతంలో వేసిన రిక్రూట్మెంట్లకు న్యాయపరమైన అడ్డంకులను పరిష్కరిస్తూ నియామక పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన 13,444 మంది కానిస్టేబుల్స్‌కు నియామక పత్రాల పంపిణీకి రేవంత్‌ హాజరై మాట్లాడారు. నిరుద్యోగులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుంచి బయట పడేయాలనే తమ ప్రయత్నమన్నారు.

ఇప్పటికే నర్సింగ్‌ ఆఫీసర్స్‌, సింగరేణి ఉద్యోగాల్లో చికుముడులు విప్పి నియామకాలు పూర్తి చేశామన్నారు. ఏ తప్పు లేకుండా ఎవరికి నష్టం జరగకుండా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం తెలిపారు. నిరుద్యోగుల కోసం అర్హత వయసును 44 నుంచి 46 ఏళ్లకు పెంచామన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే పదేడ్లు కాదు.. 20 ఏండ్లు ప్రజా ప్రభుత్వం ఉంటుందన్నారు.

తెలంగాణను కబలించడానికి గంజాయి, డ్రగ్స్‌ ముఠాలు తిరుగుతున్నాయని, వాటిని కూకటివేళ్లతో పెకిలించాల్సిన బాధ్యత మీపై ఉందని పోలీస్‌ అధికారులకు సూచించారు. తెలంగాణ యువతను నిర్వీర్యం చేసే గంజాయి, డ్రగ్స్‌ ముఠాలు రాష్ట్రంలో ఉండకూడదన్నారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌ రెడ్డి, హర వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

ANN TOP 10