AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి

2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం పద్దును సభ ముందు ఉంచారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. సమాన్వతమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గుణాత్మక మార్పు తీసుకురావటమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఎలాంటి త్యాగాలకైనా సర్కార్ సిద్ధంగా ఉంటుందని, ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియాగాంధీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. తమది ప్రజల ప్రభుత్వమని, తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట ఇచ్చామని భట్టి విక్రమార్క గుర్తు చేశారు.

ANN TOP 10