AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పీవీకి భారతరత్న రావడంపై.. కుమార్తె వాణీదేవి స్పందన..

హైదరాబాద్: భారతమ్మ బంగారు ముద్దు బిడ్డ, రాజనీతిజ్ఞుడు, బహూ బాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిన మహానేత. రూపాయి విలువ పడిపోకుండా కాపాడిన అపర మేధావి. తెలుగు బిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ పాములపర్తి వెంకట నరసింహా రావును (పీవీ నరసింహా రావు) మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు వరించింది. పీవీకు ఈ అవార్డు రావడంపై ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి ఏబీఎన్‌తో సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పీవీతో ఉన్న గత స్మృతులను గుర్తుకుతెచ్చుకున్నారు.

టెక్నాలజీని ఉపయోగించటం‌లో పీవీ దిట్ట: వాణీదేవి
ఆలస్యమైనా నాన్నకు భారతరత్న రావటం చాలా సంతోషంగా ఉందని వాణీదేవి అన్నారు. ఆయన అజాత శత్రువని.. అన్ని పార్టీల్లో పీవీకు మిత్రులున్నారని చెప్పారు. పీవీ ఆర్థిక సంస్కరణల వల్లే భారతదేశం ఈ స్థితిలో ఉందని చెప్పారు. ఆయన ఎక్కువగా మాట్లాడరని.. వినటం, నేర్చుకోవటం చాలా ఇష్టమన్నారు. టెక్నాలజీని ఉపయోగించటం‌లో పీవీ దిట్ట అని చెప్పారు. తాను చూసిన మెదటి ల్యాప్‌టాప్ నాన్నదేనని తెలిపారు. అష్టావధానం, ఫొటోగ్రాఫింగ్ అంటే పీవీకి చాలా ఇష్టమని వాణీదేవి పేర్కొన్నారు.

ANN TOP 10