AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు అరెస్ట్!

పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న దుర్గారావును అనంతపురం గుంతకల్ల రైల్వే స్టేషన్‌లో తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు పోహైల్ ప్రగతి భవన్‌ వద్ద రోడ్డు ప్రమాదం కేసులో దుర్గారావు నిందితుడిగా ఉన్నారు. అయితే షకీల్‌ కొడుకు పారిపోయేందుకు ఆయన సహకరించాడని ఉన్నతాధికారులు తేల్చడంతో సీపీ కొత్తకోత శ్రీనివాస్‌ ఆయనను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక అరెస్టు తప్పదన్న వార్తల నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నారు. అప్పటి గాలిస్తున్న తరుణంలో సోమవారం పోలీసులు పట్టుకున్నారు. విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేయనున్నారు. కాగా వ్యవహారంపై రాజకీయపరంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి.

దీంతో సమగ్ర దర్యాప్తు జరిపి తనకు నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించడంతో.. పోలీసుల నిర్వాకం బయటపడింది. సీఐ దుర్గరావు నిర్లక్ష్యంగా వ్యవహరించి సోహైల్‌ను తప్పించే ప్రయత్నం చేశారని తేలింది. ఈ క్రమంలోనే దుర్గారావును సస్పెండ్ చేశారు. మరోవైరు ఈ కేసులో సోహైల్‌ను ఏ1 గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం దుర్గారావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదిలా ఉండగా పంజాగుట్ట స్టేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్.. అందర్నీ మార్చేశారు. స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న 86 మంది సిబ్బందిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బదిలీ చేశారు.

ANN TOP 10