AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నామినేటెడ్ ఎమ్మెల్సీలకు షాక్!

ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్‌ల నియామకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై అమోదం తెలిపారు. ఈ ఇద్దరు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న తరుణంలో వారి ఎమ్మెల్సీల నియామకంపై దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంపై హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు వారితో ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశించింది. వచ్చే నెల 8న మరోసారి మిగతా వాదనలు వింటమని తెలిపింది. అప్పటి వరకు యధాస్థితిని కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే గత ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ సమయంలోనే గవర్నర్ తమిళిసై అభ్యంతరం వ్యక్తం చేసి.. రాజకీయ పార్టీ నేపథ్యం ఉన్నవాళ్లకు ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వలేనంటూ తిరస్కరించారు. దీంతో వీళ్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇక నిజానికి సోమవారమే వారు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. వారు మండలికి వచ్చినా ఛైర్మన్‌ రాకపోవడంతో నిరాశే ఎదురైంది. తాజాగా హైకోర్టు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంపై స్టే విధించడంతో హాట్ టాపిక్‌గా మారింది.

ANN TOP 10