AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వంగవీటి రత్నకుమారి పరిస్ధితి విషమం ? ఆస్పత్రికి నేతల క్యూ..

టీడీపీ నేత వంగవీటి రాధా తల్లి, దివంగత వంగవీటి రంగా సతీమణి రత్నకుమారి తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. మాజీ ఎమ్మెల్యే కూడా అయిన రత్నకుమారి విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడే ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన రంగా అభిమానులు భారీ ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వంగవీటి రత్నకుమారి కొన్నేళ్లుగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

రాజకీయాలకు దూరంగా ఉండటంతో పాటు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. తాజాగా కుమారుడు వంగవీటి రాధా పెళ్లిలో కనిపించిన ఆమె.. ఇప్పుడు అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వంగవీటి రంగా అభిమానులు ఈ వార్త తెలియగానే భారీ ఎత్తున ఆస్పత్రికి తరలివచ్చి ఆమెను పరామర్శిస్తున్నారు. గతంలో వంగవీటి రంగాతో పెళ్లి తర్వాత కూడా ఇంటిపట్టునే ఉన్న రత్నకుమారి ఆయన హత్య తర్వాత తెరపైకి వచ్చారు.

రంగా హత్య తర్వాత ఎమ్మెల్యేగా కూడా ఎన్నికైన ఆమె.. ఆ తర్వాత కొంతకాలం యాక్టివ్ గానే ఉన్నారు. ఓ దశలో ఎమ్మెల్యే సీటు కోసం కుమారుడు రాధాతో పోటీ పడ్డారు కూడా. చివరికి ఎమ్మెల్యే పదవీకాలం పూర్తయిన తర్వాత మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత పలు పార్టీలు అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చినా ఆమె మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.

ANN TOP 10