హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరుగురు ఇన్స్పెక్టర్లను, ఐదుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ కమిషనర్ అవినాశ్ మహంతి(Commissioner Avinash Mahanty) ఆదేశాలు జారీ చేశారు. మరో ఆరుగురు ఇన్స్పెక్టర్ల సర్వీసులను వారి పేరెంట్ జోన్ (మల్టీ జోన్-2)కు అప్పగిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన వారిలో..
ఇన్స్పెక్టర్లు: పి.నవీన్‌కుమార్ స్పెషల్ బ్రాంచి నుంచి బాలానగర్ ఎస్హెచ్ఓగా, బాలానగర్ ఎస్హెచ్ఓగా ఉన్న కె.భాస్కర్‌ను సైబరాబాద్ సీటీసీకి, వీఆర్‌లో ఉన్న జి. జగన్నాథ్‌ను ఆర్సీపురం, కొల్లూరు డీఐగా, వీఆర్‌లో ఉన్న హరిక్రిష్ణారెడ్డిని నార్సింగి ఎస్హెచ్ఓగా, మాదాపూర్ డీఐ విజయ్ నాయక్‌ను జీడిమెట్ల డీఐగా, ఎస్బీలో ఉన్న వెంకట్‌రెడ్డిని షాద్‌నగర్ రూరల్ సీఐగా బదిలీ చేశారు.
ఎస్సైలు: అత్తాపూర్‌లో ఉన్న కె.లింగంను కేశంపేట్ పీఎస్‌కు, తలకొండపల్లిలో ఉన్న సీహెచ్ శ్రీనును అత్తాపూర్ పీఎస్‌కు, జగద్గిరిగుట్టలో ఉన్న శ్రీకాంత్‌ను తలకొండపల్లి పీఎస్‌కు, ఎయిర్‌పోర్టు పీఎ్‌సలో ఉన్న వై.సురేందర్‌రెడ్డిని పేట్‌బషీరాబాద్ పీఎస్‌కు, కేశంపేట్ పీఎస్‌లో ఉన్న వరప్రసాద్‌ను ఎయిర్‌పోర్టు పీఎస్ కు బదిలీ చేశారు.
సరెండర్ ఆఫ్ సర్వీస్: జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్హెచ్ఓగా ఉన్న వెంకట్‌రెడ్డి, జీడిమెట్ల డీఐ మహమ్మద్ నదీమ్ హుస్సేన్, రాజేంద్రనగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎన్.సుమన్‌కుమార్, ఆర్సీపురం డీఐ కోరె వెంకటేశ్వర్లు, పోలీస్ కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్ టి.నర్సింగ్‌రావు, షాద్‌నగర్ రూరల్ సీఐ డీకే లక్ష్మారెడ్డిల సర్వీ్‌సలను మల్టీజోన్-2కు సరెండర్ చేస్తూ ఆదేశాలిచ్చారు.