AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ

అధికార ప్ర‌తినిధి బాయిన్‌వార్ గంగారెడ్డి రాజీనామా
హైద‌రాబాద్ లో కంది శ్రీ‌నివాస‌రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరిక
ఆయ‌న వెంటే మాజీ ఎమ్మెల్యే జోగు రామ‌న్న స‌న్నిహితుడు

అమ్మ‌న్యూస్ ప్ర‌తినిధి ఆదిలాబాద్ : ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు క‌కావిక‌ల‌మైన బీఆర్ ఎస్ పార్టీకి మ‌రో పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. జిల్లాలో ముఖ్య నాయ‌కుల‌తోపాటు కార్య‌క‌ర్త‌లు వ‌రుస‌గా ఒక్కొక్క‌రుగా కారు పార్టీని వీడుతూ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి కి జై కొడుతూ ఆయ‌న నేతృత్వంలో కాంగ్రెస్ కండువాలు క‌ప్పుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి బాయిన్‌వార్ గంగారెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న సన్నిహితుడు, దీపాయిగూడ గ్రామానికి చెందిన పోతారెడ్డి ప‌ద‌వికి, పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

హైదరాబాద్‌లో ఉన్న కంది శ్రీ‌నివాస రెడ్డిని క‌లిసి ఆయ‌న స‌మ‌క్షంలో కాంగ్రెస్ లో చేరారు. వారికి కేఎస్ ఆర్ కండువాలు కప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానిoచారు. ఇటీవ‌లే వివిధ గ్రామాల స‌ర్పంచులు , యంపీటీసీలు , మాజీ స‌ర్పంచుల చేరిక‌తో బీఆర్ ఎస్ పార్టీ కుదేల‌య్యింది. ఈ వ‌రుస చేరిక‌ల ప‌ర్వం ఇలాగే కొనసాగితే ఆదిలాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో గులాబీ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకు పోయే ప‌రిస్థితి నెల‌కొంటుందేమోన‌న్న భ‌యం జిల్లా నాయ‌క‌త్వాన్ని వెంటాడుతోంది. ఈ కార్య‌క్ర‌మంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దుర్గం రాజేశ్వర్, జైనథ్ జడ్పీటీసీ అరుంధతి వెంకట్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మెన్ ముడుపు దామోదర్ రెడ్డి, బోనం మ‌ల్ల‌య్య‌,కిసాన్ సెల్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బోరంచు శ్రీ‌కాంత్ రెడ్ది, సీనియ‌ర్ నాయ‌కులు గిమ్మ సంతోష్ రావు, దామోదర్‌రెడ్ది, తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10