AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే సంతోషంగా ఉంది: జానారెడ్డి

ప్రజా పాలన ఒరవడితో ముందుకు వెళ్తోంది
ప్రభుత్వంపై జానారెడ్డి ప్రశంసలు

అమ్మన్యూస్ (హైదరాబాద్): సీఎం రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రశంసలు కురిపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెలరోజుల పాలన చూస్తుంటే సంతోషంగా ఉందని అన్నారు. ప్రభుత్వం ప్రజా పాలన ఒరవడితో ముందుకు వెళుతోందని చెప్పారు. ఈ ప్రభుత్వం ప్రజల మధ్యన ఉందన్న భావన కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇదే ఒరవడిని పాలన కొనసాగించాలని, మేధావులు, ప్రజాసంఘాల, పార్టీల సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. రేవంత్ రెడ్డి సర్కార్ గత పరిస్థితులను వివరిస్తూ, సమస్యలు అధిగమించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు రాత్రింబవళ్ళు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో తన వంతు పాత్ర ఉంటుందని, గతంలో పార్టీకి నాయకత్వం వహించానని ఇప్పుడు పార్టీ కార్యకర్తగా పని చేస్తానని స్పష్టం చేశారు. తనకు ఉన్న అనుభవాన్ని, సలహాలను ప్రభుత్వానికి, ప్రజలకు ఇవ్వడానికి సిద్ధమేనని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై 10 ఏళ్ల క్రితం చెప్పినవే ఇప్పుడు నిజమయ్యాయని, అప్పులు, విద్యుత్ కొనుగోళ్లు భవిష్యత్‌కు ప్రమాదమేనని హెచ్చరించిన జానారెడ్డి గుర్తు చేశారు. అలాగే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీకి కానుకగా ఇద్దామని జానారెడ్డి అన్నారు.

ANN TOP 10