AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

హైదరాబాద్: ఉప్పల్ టెస్ట్‌లో పర్యాటక జట్టు ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టాస్ ఓడిన భారత జట్టు మొదట బౌలింగ్ చేయనుంది. టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేసే వాళ్లమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. పిచ్ పొడిగా కనిపిస్తోందని చెప్పాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన, బౌలింగ్ చేసిన గెలవడానికి తమ దగ్గర సరైన నైపుణ్యాలున్నాయని పేర్కొన్నాడు. ఇంతకుముందు కూడా తాము ఇలాంటి పరిస్థితుల్లో ఆడామని, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తమకు తెలుసని అన్నాడు. ఈ మ్యాచ్‌లో తాము ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. పేసర్లుగా బుమ్రా, సిరాజ్.. స్పిన్నర్లుగా జడేజా, అశ్విన్, అక్షర్ ఆడుతున్నారని తెలిపాడు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకోకపోవడం కష్టతరమైనదని పేర్కొన్నాడు. అయితే ఇటీవల కాలంలో ఇలాంటి పరిస్థితుల్లో అక్షర్ పటేల్ బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్ కూడా బాగా చేశాడని అందుకే అతన్ని తీసుకున్నట్టు రోహిత్ శర్మ చెప్పాడు.

ANN TOP 10