AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైద‌రాబాద్ కు టెస్ట్ క్రికెట్ ఫివ‌ర్

ఉప్ప‌ల్ స్టేడియంలో ఇండియా ,ఇంగ్లాండ్ ఢీ
ఐదు టెస్ట్ ల సిరీస్ లో గురువారం ఫ‌స్ట్ టెస్ట్
బ్యాంటింగ్ కు స్వ‌ర్గ‌ధామం
స్నిన్న‌ర్ల‌కు అనుకూలం
ఈస్టేడియంలో ఓట‌మెరుగ‌ని భార‌త్

అమ్మ‌న్యూస్ ప్ర‌తినిధి: హైద‌రాబాద్ టెస్ట్ క్రికెట్ ప్రియుల‌కు ఐదు రోజుల పండ‌గ వ‌చ్చేసింది. ఐదేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హైద‌రాబాదీల‌కు ఇండియా ,ఇంగ్లండ్ టెస్ట్ జ‌ట్లు అస‌లైన క్రికెట్ విందును అందించనున్నాయి. ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్ లోభాగంగా గురువారం భార‌త్ ఇంగ్లాండ్ ల మ‌ధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. దాదాపు ఐదేళ్ల త‌ర్వాత హైద‌రాబాద్ లో టెస్ట్ మ్యాచ్ జ‌రుగనుండటంతో అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టివ‌ర‌కు ఇక్క‌డ ఇండియా ఓట‌మంటే ఎరుగ‌దు గ‌తంలో 2018 లో చివ‌రి సారిగా భార‌త్ ఇక్క‌డ వెస్టిండీస్ తో త‌ల‌ప‌డింది. 1955 నుండి 2018 వ‌ర‌కు హైద‌రాబాద్ లోని లాల్ బ‌హ‌దూర్ స్టేడియం ,ఉప్ప‌ల్ స్టేడియాల్లో జ‌రిగిన 9 మ్యాచుల‌లో భార‌త్ ఐదింట గెలిచింది. మూడు మ్యాచులు డ్రా కాగా ఒక‌టి క్యాన్సిల్ అయింది. ఇక రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలోని టీమ్ ఇండియా ఆత్మ‌విశ్వాసంతో ఉండ‌గా ఇప్ప‌టివ‌ర‌కు ఇక్క‌డ టెస్ట్ మ్యాచ్ ఆడ‌ని ఇంగ్లాండ్ స్టోక్స్ కెప్టెన్సీలో భార‌త్ ను ఎలా ఎదుర్కోబోతుంద‌నేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య 131 టెస్టులు జ‌ర‌గ‌గా భార‌త్ 50 ఇంగ్లాండ్ 31 మ్యాచుల‌లో విజ‌యం సాధించాయి. 50 మ్యాచులు ఫ‌లితం తేల‌కుండా ముగిసాయి. భార‌త్ జ‌ట్టులో కీప‌ర్ కేఎల్ రాహుల్ బ్యాట‌ర్ గానే కొన‌సాగే అవ‌కాశ‌ముంది.వికెట్ కీప‌ర్లుగా కెఎస్ భ‌ర‌త్ , ధృవ్ జురెల్ ల‌ను జ‌ట్టులోకి తీసుకున్నారు. అయితే భ‌ర‌త్ ను ఆడించే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంది. గురువారం ఉద‌యం 9-30 కు ప్రారంభం కాబోయే మ్యాచ్ లో టాస్ గెలిచిన జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవ‌కాశ‌ముంది.

ANN TOP 10