ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో వెలసిన వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని ప్రతి ఒక్క భక్తుడు అనుకుంటాడు. ఏ సీజన్లోయినా తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. దేశంలోనే తిరుపతి వెంకటేశ్వరస్వామి అత్యంత ప్రసిద్ధిచెందాడు. దేశ విదేశాల నుంచి భక్తులు ఏడుకొండలవాడిని దర్శనార్థం వస్తుంటారు. ప్రముఖులు, రాజకీయనాయకులు, సెలబ్రిటీలు సైతం ఇక్కడ క్యూ కడుతుంటారు. అంతటి మహిమగల స్వామి తిరుపతి వెంకటేశ్వరస్వామి. తిరుమల తిరుపతిని దర్శించుకునే భక్తులకు రైల్వే శాఖ ఓ శుభవార్తను మోసుకొచ్చింది. తిరుమలకు నిత్యం వేలాదిమంది భక్తులు బారులు తీరుతుంటారు. ఆ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతికి వెళ్లేవారికి నాలుగు స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. అవి కూడా ఈ నెలలో అందుబాటులోకి రానున్నట్లు వివరించింది.
జనవరి 25, 26, 27, 28 తేదీల్లో తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. అవి సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే 07041 నంబర్‌గల ట్రైన్ జనవరి 25న గురువారం రోజు సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు తిరుపతికి బయలుదేరుతుంది. ఆ ట్రైన్ శుక్రవారం ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అదే రైలు తిరుపతి నుంచి సికింద్రాబాద్ (07042) తిరుగు ప్రయాణంలో జనవరి 26 శుక్రవారం రాత్రి 07:50 గంటలకు బయలుదేరుతుంది. అనర్హత వేటుకు రంగం సిద్దం – లిస్టులో ఆ నలుగురితో పాటుగా..!! మరుసటి రోజు అంటే శనివారం ఉదయం 09:30 గంటలకు సికింద్రాబాద్ వస్తుంది. జనవరి 27న సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 02764 ఈనెంబర్ గల ట్రైన్ శనివారం సాయంత్రం 06:40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఆదివారం ఉదయం 06:45 గంటలకు ఆ ట్రైన్ తిరుపతికి చేరుకుంటుంది. మళ్లీ తిరిగి తిరుపతి నుంచి సికింద్రాబాద్ (02763)కు జనవరి 28 ఆదివారం సాయంత్రం 05:15 గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం 05:55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ఇదో చక్కటి అవకాశం. కాబట్టి ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ కోరింది.









