AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాల్దీవుల తీరంలో తిష్ట వేసిన చైనా గూఢచార నౌక

రీసెర్చ్, సర్వే సౌకర్యాలతో ఒక చైనా గూఢచార నౌక మాల్దీవుల నౌకాశ్రయంలో తిష్టవేసింది. భారత్‌-మాల్దీవుల దౌత్య సంబంధాలు దెబ్బతిన్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. మాల్దీవుల ప్రభుత్వం అనుమతివ్వడంతో చైనా నౌక అక్కడికి చేరుకుంది. అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ అధికారంలోకి తర్వాత ఈ నెల ఆరంభంలోనే చైనాలో పర్యటించారు. భారత్ – మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్న వేళ చైనా నౌకకు ఆయన అనుమతిఇచ్చారు.

ఈ విషయాన్ని మాల్దీవుల ప్రభుత్వం కూడా నిర్ధారించింది. చైనీస్ రీసెర్చ్ నౌర ‘జియాంగ్ యంగ్ హోంగ్ 3’ మాల్దీవుల జలాలోనే ఉందని, అయితే ఎలాంటి రీసెర్చ్ లేదా సర్వే నిర్వహించడంలేదని వెల్లడించింది. స్నేహపూర్వక దేశాల నౌకలను ఎప్పుడూ స్వాగతిస్తూనే ఉంటామని పేర్కొంది.

ANN TOP 10