AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాహుల్ గాంధీని అడ్డుకుంటారా?: బీజేపీపై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు

అస్సాంలో భారత్ జోడో యాత్ర చేస్తోన్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని అడ్డుకోవడాన్ని తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాహుల్ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం, గుడి సందర్శనకు అనుమతి ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి సరికాదన్నారు. బీజేపీ స్పాన్సర్డ్ దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. రాహుల్ భద్రత విషయంలో కూడా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని రేవంత్ ఆరోపించారు. ఇలాంటి చర్యలతో రాహుల్ గాంధీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రలు ఫలించవన్నారు. మరింత మనోధైర్యంతో ఆయన ముందుకు సాగుతారన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు అండగా ఉన్నారన్నారు. ఈ దేశ ప్రజల మద్దతు ఆయనకుందన్నారు.

తెలంగాణ సమాజం కూడా రాహుల్ గాంధీకి అండగా ఉంటుందని రేవంత్ చెప్పారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలకు అండగా, పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో రాహుల్ తలపెట్టిన ఈ యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుందన్నారు రేవంత్. అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రను అడ్డుకున్నందుకు నిరసనగా కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ చేపట్టింది. బషీర్ బాగ్ బాబు జగ్జీవన్ రావ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ జరిగింది. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీప్ దాస్ మున్షీ, మంత్రి శ్రీధర్ బాబు, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, మధు యాష్కీ, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, మాజీ కేంద్ర మంత్రులు బలరాం నాయక్, రేణుక పలువురు నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ANN TOP 10