దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన ఉదయం 5.59 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని.. 6.20 గంటలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చామని తెలిపారు. గురువారం తెల్లవారుజామున ఎయిమ్స్ రెండో అంతస్తులో ఉన్న టీచింగ్ బ్లాక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డైరెక్టర్ కార్యాలయంలోని ఫర్నీచర్, ఆఫీసు రికార్డులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు చెప్పారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.









