AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్‌.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమా..

రేవంత్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేసింది. గురువారం ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల భూమి ఉన్న రైతన్నల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యాని అధికారులు తెలిపారు. ఒకటి లేదా రెండు రోజుల్లో మిగతా అందరి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులను జమ చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో రైతులకు శుభవార్త చెప్పినట్లైంది. రైతు బంధు నిధులు ఆలస్యం కావడంతో ఒకింత రైతులు ఆందోళన చెందారు. అయితే తాజాగా ఎకరం నుంచి రెండు ఎకరాల మధ్య భూమి ఉన్న వారికి రైతు బంధు నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలపడం రైతుల కళ్లలో సంతోషాన్ని నింపింది.

ANN TOP 10