AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు.. హౌతీలకు వార్నింగ్‌ ఇచ్చిన అమెరికా సహా 12 దేశాలు

ఎర్ర సముద్రం (Red Sea)లో వాణిజ్య నౌకలపై వరుస దాడులు చేస్తున్న హౌతీ రెబల్స్‌ (Houthi rebels)కు అమెరికా సహా 12 దేశాలు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాయి. దాడులు తక్షణమే ఆపకుంటే తమ మిలటరీకి పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించాయి. ఈ మేరకు 12 దేశాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి.

అమెరికా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బెల్జియం, కెనడా, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యూకే దేశాలు ఈ ప్రకటనపై సంతకాలు చేశాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ప్రతిస్పందనగా గతేడాది డిసెంబర్ 19 నుంచి ఇప్పటి వరకు హౌతీ రెబల్స్ ఎర్రసముద్రంలో 23 సరకు రవాణా నౌకలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 12 దేశాలు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాయి.

ANN TOP 10