AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అయోధ్యలో ప్రధాని మోదీ.. రైల్వేస్టేషన్ ప్రారంభం

అయోధ్యలో పునర్నిర్మించిన రైల్వేస్టేషన్.. అయోధ్య ధామ్ రైల్వేస్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు. అలాగే.. కొత్త అమృత్ భారత్ రైళ్లు, 6 వందేభారత్ రైళ్లను జెండా ఊపి మోదీ ప్రారంభించారు. అయోధ్యలో ఒక రోజు పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ బిజీగా గడుపుతున్నారు. అనేక ఇతర రైల్వే ప్రాజెక్టులను కూడా ఆయన జాతికి అంకితం చేశారు. ఇవాళ ప్రధాని మోదీ, అయోధ్యలో కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ప్రారంభించారు.

అలాగే రాష్ట్రంలో రూ.15,700 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసే బహిరంగ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటున్నారు. వీటిలో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి సుమారు రూ.11,100 కోట్ల విలువైన ప్రాజెక్టులు, ఉత్తరప్రదేశ్ అంతటికీ సంబంధించి దాదాపు రూ.4600 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి.

ఇది కాకుండా, అయోధ్య చుట్టుపక్కల సుందరీకరణ, పౌర సౌకర్యాల మెరుగుదలకు దోహదపడే అనేక కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు PMO తెలిపింది. అయోధ్యలోని అత్యాధునిక విమానాశ్రయం మొదటి దశను రూ.1,450 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసినట్లు ప్రకటనలో తెలిపింది. విమానాశ్రయ టెర్మినల్ భవనం 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది, ఇది ఏటా సుమారు 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలను అందించడానికి సిద్ధంగా ఉంటుంది.

రాముడి జన్మస్థలంతో ముడిపడి ఉన్న ఈ పవిత్ర స్థలం కోసం నిర్మించిన విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌ని రామాయణ గాథలతో నిర్మించారు. రాముడు, లక్ష్మణుడు, సీతా మాత, హనుమంతుడు. రామాయణానికి సంబంధించిన ఇతర పాత్రలు ఈ ప్రాజెక్టుల్లో కనిపిస్తాయి.

విమానాశ్రయ టెర్మినల్ భవనం యొక్క ముఖభాగం అయోధ్యలో రాబోయే శ్రీరామ దేవాలయం యొక్క ఆలయ నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది. టెర్మినల్ భవనం లోపలి భాగాన్ని శ్రీరాముడి జీవితాన్ని వర్ణించే స్థానిక కళ, పెయింటింగ్‌లు, మరియు కుడ్యచిత్రాలతో అలంకరించారు. అయోధ్య విమానాశ్రయం యొక్క టెర్మినల్ భవనంలో ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, LED లైటింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఫౌంటైన్‌లతో ల్యాండ్‌స్కేపింగ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్ వంటి వివిధ సౌకర్యాలు ఉన్నాయి.

ఈ ప్రాంతంలో విమానాశ్రయం కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, ఇది పర్యాటకం, వ్యాపార కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలను పెంచుతుందని PMO తెలిపింది. పునరాభివృద్ధి చెందిన అయోధ్య రైల్వే స్టేషన్ మొదటి దశను రూ.240 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేశారు. అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వేస్టేషన్ అని పిలిచే మూడు అంతస్తుల ఆధునిక రైల్వేస్టేషన్‌లో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజా, పూజ అవసరాల కోసం దుకాణాలు, క్లాక్ రూమ్, పిల్లల సంరక్షణ గది, వెయిటింగ్ హాల్ వంటి అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.

ANN TOP 10