కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. అర్హులందరికీ త్వరలో కార్డులు జారీ చేస్తాం. గ్రామ సభల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తాం. అక్కడ కొత్త రేషన్ కార్డులతో పాటు ఇతర ఎలాంటి దరఖాస్తు ఫారాలు ఇచ్చినా తీసుకుంటాం. ఆ సమస్యలు తీరుస్తాం’ అని గ్యారంటీల దరఖాస్తుల ఫారం విడుదల సందర్భంగా స్పష్టం చేశారు.









