AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భూపాలపల్లి సింగరేణి కేటీకే-5 ఇంక్లైన్ గని దగ్గర ఉద్రిక్తత

భూపాలపల్లి సింగరేణి కేటీకే-5 ఇంక్లైన్ గని దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం దగ్గర ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ కార్మిక సంఘాల నాయకులు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. కాగా.. భూపాలపల్లిలోని 9 పోలింగ్ కేంద్రాల్లో 30 శాతం పోలింగ్ నమోదైంది.

బెల్లంపల్లి ఏరియాలో 38.1 శాతం పోలింగ్ నమోదు కాగా.. మంచిర్యాలలో తొలి రెండు గంటల్లో శ్రీరాం పూర్ ఏరియా 27.29 శాతం నమోదైంది. మందమర్రిలో 25.23 శాతం, బెల్లంపల్లి 38.1 శాతం పోలింగ్ నమోదు అయినట్టు అధికారులు వెల్లడించారు. రామగుండం రీజీయన్‌లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పుటి వరకూ 30శాతం పోలింగ్ నమోదైంది.

ANN TOP 10