కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. త్వరలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 28 నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆరు గ్యారంటీల్లో మరికొన్నింటిని టీసర్కార్ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రేషన్ కార్డుల పంపిణీ కూడా ఉండనుంది. మీ సేవ ద్వారా ఆన్లైన్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం క్షేత్రస్థాయిలో అర్హుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు.
ఆన్లైన్లో దరఖాస్తు అనంతం.. పరిశీలన ఆపై ఎంపిక ప్రక్రియ గ్రామసభలు, నగరాలు, పట్టణాల్లో బస్తీ సభల ద్వారా జరగనుంది. దీనికోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను ప్రభుత్వం నియమించనుంది. ప్రభుత్వం జారీ చేయనున్న కొత్త రేషన్ కార్డుల కోసం లక్ష కుటుంబాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ బియ్యం, పంచదార, గోధుమలు వంటివి ప్రభుత్వం ఇవ్వనుంది. అయితే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలన్నా కూడా 28వ తేదీ నుంచి అవకాశం లభించనుంది.