AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇందిరా పార్కు వద్ద I.N.D.I.A. కూటమి ధర్నా

– పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి
– దాడిపై వివరణ ఇవ్వాలని అడిగిన ఎంపీలను సస్పెండ్‌ చేశారంటూ ఆగ్రహం
– మోదీ ప్రభుత్వానికి దేశ రక్షణ పట్టడం లేదంటూ వ్యాఖ్య

నగరంలోని ఇందిరాపార్కు వద్ద ఇండియా(I.N.D.I.A.) కూటమి ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి పాల్గొన్నారు. పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను పెద్ద సంఖ్యలో సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ.. ‘ఇండియా’ కూటమి దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా శుక్రవారం ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్, కూటమి నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. సేవ్‌ డెమోక్రసీ పేరిట ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. దాడిపై వివరణ ఇవ్వాలని అడిగిన 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేయడం దారుణమన్నారు. పార్లమెంట్‌లో జరిగిన ఘటనపై హోంమంత్రి అమిత్‌ షా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని భట్టి విక్రమార్క అన్నారు. ఎంతోమంది త్యాగాల ఫలితం వల్ల దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. కానీ ప్రస్తుతం దేశంలో అరాచక పాలన సాగుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందన్నారు. నియంతృత్వ పోకడలతో నరేంద్రమోదీ పాలన కొనసాగుతోందన్నారు. పార్లమెంటును రక్షించలేని బీజేపీ.. దేశ రక్షణను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10