AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రజావాణికి భారీ స్పందన.. వినతులు స్వీకరిస్తున్న అధికారులు

ప్రజాభవన్‌లో ప్రజావాణికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఈ కార్యక్రమంలో అర్జీలు సమర్పించేందుకు ముఖ్యంగా భూవివాదాలు, పింఛన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజావాణి ఉండనుంది. అయితే ఉదయం నుండే ప్రజలు ఇస్తున్న వినతులను అధికారులు స్వీకరిస్తున్నారు. ఉదయం 10 గంటలలోపు ప్రజాభవన్ చేరుకున్న వారికి వినతులు ఇచ్చే అవకాశం ఉండటంతో భారీగా జనాలు తరలివస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి పలు జిల్లాల నుంచి ప్రజలు ప్రజాభవన్‌కు వస్తున్నారు. ధరణి సమస్యలు, పెన్షన్, డబుల్ బెడ్ రూం సమస్యలపైనే జనం ఎక్కువగా వస్తున్న పరిస్థితి.

ANN TOP 10