AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు షమీ దూరం

వరల్డ్ కప్ లో నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్ మన్లను గడగడలాడించిన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడేది అనుమానంగా మారింది. షమీ కాలి మడమ గాయంతో బాధపడుతున్నట్టు తెలిసింది. దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన ఈ నెల 10న మొదలైంది. ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతుండగా, ఆ తర్వాత వన్డే సిరీస్, డిసెంబరు 26 నుంచి టెస్టు సిరీస్ జరగనున్నాయి.
వరల్డ్ కప్ ఆడిన జట్టులో కొందరు ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20, వన్డే సిరీస్ లకు విశ్రాంతినిచ్చారు.

వారిలో షమీ కూడా ఉన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ లను టెస్టు సిరీస్ కు ఎంపిక చేశారు. రోహిత్ శర్మ తదితరులు డిసెంబరు 15న దక్షిణాఫ్రికా పయనం కానున్నారు. అయితే, షమీ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని సమాచారం. అతడు లేకుండానే టీమిండియా బృందం దక్షిణాఫ్రికా వెళ్లే అవకాశాలున్నాయి. షమీ స్థానాన్ని ఎవరితో భర్తీ చేసేదీ బోర్డు ఇంకా వెల్లడించలేదు.

ANN TOP 10