AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆర్మూర్‌లో చీకటి దొంగల ఆటలిక చెల్లవు.. బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి

ఆర్మూర్ నియోజకవర్గంలో ఇకపై ఎలాంటి అక్రమాలు జరగనివ్వనని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. చీకటి దొంగలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తాను ఎవరికీ భయపడనని తేల్చి చెప్పారు. వారం రోజుల వ్యవధిలో తనకు వందలాదిగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మీడియాకు తెలిపారు. తన అంతు చూస్తామని, చంపేస్తామని విదేశాల నుంచి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని చెప్పారు. అయితే, తనను చంపడం వీళ్ల వల్ల కాదని, తనను పుట్టించిన భగవంతుడికి మాత్రమే సాధ్యమని అన్నారు. అవసరమైతే మగధీర సినిమాలో రామ్ చరణ్ లా అందరినీ చంపాకే తాను చస్తానని అన్నారు.

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెడతానని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి చెప్పారు. అక్రమ మైనింగ్ వ్యవహారంపై విచారణ జరిపించాలని ఇప్పటికే సీబీఐని కోరామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ వస్తే పరిశీలిస్తామని సీబీఐ డైరెక్టర్ చెప్పారన్నారు. ఈ విషయంపై త్వరలోనే రాష్ట్ర హోంమంత్రి, సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి చెప్పారు. బెదిరింపు కాల్స్ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు.

ANN TOP 10