రాష్ట్రంలో మార్పు కనిపిస్తోందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (Former Minister Motkupalli Narsimhulu) అన్నారు. శుక్రవారం ప్రజాభవన్‌కు వచ్చిన ఆయన.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాదర్బార్ బాగుందన్నారు. వేలాది మంది ప్రజలు వారి సమస్యలు చెప్పుకోడానికి వస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ఏ సీఎం చేయని పని రేవంత్ చేస్తున్నారని అభినందించారు. తాను చూడ్డానికి వచ్చానని.. చాలా సంతోషంగా ఉందన్నారు. గడీలు బద్దలు కొట్టి ప్రజలు వస్తున్నారని మోత్కుపల్లి నరసింహులు పేర్కొన్నారు.
