ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం తర్వాత ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. 11 మంది మంత్రుల శాఖలపై సాయంత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ పెద్దలను రేవంత్ కలవనున్నారు. ఇవాళ రాత్రికి హస్తిన నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. ఇంకో ఆరుగురు మంత్రులను ఎవ్వరిని నియమించాలన్న అంశాలపై అధిష్టానంతో ముఖ్యమంత్రి చర్చించనున్నట్లు సమాచారం.
రేపు ఉదయం 8:30 గంటలకు ప్రొటెం స్పీకర్ చేత రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభకానున్నాయి. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి. స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరు దాదాపు ఖరారు అయ్యింది. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు.