AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఓట్ల పండుగ వేళ.. పట్నం ప్రజలు పల్లె బాట!

అసెంబ్లీ ఎన్నికల ఓట్ల పండుగ వచ్చేసింది. ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ చైతన్యం తీసుకొచ్చింది. ఈక్రమంలో బతుకుదెరువు కోసం పట్నంలో నివసిస్తున్న ప్రజలు పల్లె బాట పట్టారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికల పోలింగ్ కోసం నగరవాసులు సొంతూళ్లుకు బుధవారం బయలుదేరారు. ఈసందర్భంగా ఉప్పల్ ప్రధాన కూడలి మూడు కిలోమీటర్లు మేర ట్రాఫిక్ స్తంభించింది. ఉప్పల్ క్రాస్ రోడ్డు నంచి ఆర్టీసీ బస్సుల్లో ఓట్లు వేసేందుకు జనం ఊళ్లకు పయణం అయ్యారు. జనం రద్దీతో అప్పటికప్పుడు బస్సులు పెంచి ఓటర్లు గమ్యస్థానాలకు చేర్చేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది.

ANN TOP 10