AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గగన్‌పహాడ్‌ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

శంషాబాద్‌ ప్రాంతంలోని గగన్‌పహాడ్‌ పారిశ్రామిక వాడలో బుధవారం అగ్నిప్రమాదం(Fire accident) సంభవించింది. ఓ థర్మకోల్‌ కంపెనీలో వెల్డింగ్‌ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కంపెనీ సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గగన్‌పహాడ్‌ పారిశ్రామిక వాడలోని రంగోలి ఈపీఎస్‌ థర్మకోల్‌ కంపెనీ లో కార్మికులు వెల్డింగ్‌ పనులు చేస్తుండగా షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు ఎగిసిపడ్డాయి.

కంపెనీ యాజమన్యం అప్రమత్తం కావడంతో ఫ్యాక్టరీలో ఉన్న గ్యాస్‌ సిలిండర్లను హుటాహుటినా అక్కడి నుంచి తరలించడంతో భారీ ప్రమాదం తప్పింది. అప్పటికీ భారీగా అస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ANN TOP 10