ఢిల్లీ నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. శనివారం అర్థరాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కవితతో పాటు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్‌కు వచ్చారు. రాత్రి 12.10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు ప్రత్యేక విమానం చేరుకోగా.. అనంతరం నేరుగా ప్రగతిభవన్‌కు కవిత వెళ్లారు.
సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన కవిత.. ఈడీ విచారణ ఎలా జరిగిందనే విషయాలను వివరించారు. ఈడీ అధికారులు ఏయే ప్రశ్నలు అడిగారు? ఎలా సమాధానాలు ఇచ్చాను? అనే వివరాలను కేసీఆర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 16న మరోసారి విచారణకు రావాల్సిందిగా కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంతో.. ఆ విషయంపై కూడా ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. నెక్ట్స్ విచారణలో ఏయే ప్రశ్నలు అడుగుతారు? ఎలా ఎదుర్కొవాలి? అనే దానిపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
తొలిసారి ఈడీ విచారణలో ప్రాథమిక అంశాల గురించే ఈడీ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో మీ పాత్ర ఏంటి? నిందితులతో మీకు ఉన్న పరిచయాలు ఏంటి? నగదు లావాదేవీల్లో మీ హస్తం ఉంటి? అనే ప్రశ్నల గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ నెల 16న జరిగే విచారణలో కవితను మరింత లోతుగా ఈడీ విచారించనుందని తెలుస్తోంది. శనివారం దాదాపు 9 గంటల పాటు కవితను ఈడీ ప్రశ్నించింది. కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.