AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు వరంగల్‌లో పవన్ ఎన్నికల ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికలలో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తుండడంతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేన పోటీ చేసే ఎనిమిది స్థానాలతో పాటు బిజెపి అభ్యర్థులు పోటీ చేసే స్థానాలలో కూడా ప్రచారం చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు.

బుధవారం వరంగల్ వెస్ట్ నియోజకవరగ బిజెపి అభ్యర్థి రావు పద్మకు తరుపున ప్రచారం చేయనున్నారు. వరంగల్ ప్రధాని కూడలీల వద్ద రోడ్‌ షో చేపటనున్నారు. ఈ నెల 25 తాండూరు జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్, 26న కూకట్‌పల్లి జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ తరపున పవన్ ప్రచారం చేయనున్నారు. ఈ నెల 25న మహేశ్వరం, 26న కామారెడ్డి, 27న మహబూబాబాద్, కరీంనగర్‌లో ప్రధాని మోడీ ప్రచారం చేస్తుండడంతో పవన్ కల్యాన్ ఆ సభలకు హాజరుకానున్నారు.

ANN TOP 10