AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌..

తెలంగాణ ఉద్యమబిడ్డ ప్రముఖ ఎన్ఆర్ఐ గుడ్ బై
– త్వరలో కాంగ్రెస్ లో చేరిక
– ఆయనతో పాటు మరో పలువురు యువనేతలు

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయం లో ప్రముఖ ఎన్ఆర్ఐ, బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు,తెలంగాణ ఉద్యమకారుడు త్వరలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. ఆయన ఎవరో కాదు నల్గొండ జిల్లా, నాగార్జున సాగర్ నియోజకవర్గం, పెద్దవూర మండలం పులిచర్ల గ్రామానికి చెందిన జి ఆర్ ఆర్ ఫౌండేషన్ ఛైర్మెన్ గడ్డంపల్లి రవీందర్ రెడ్డి, తెలంగాణ మలిదశ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు, మంత్రి కేటీఆర్ కు మంచి గుర్తున్న స్నేహితుడు కావడం విశేషం.

త్వరలో నాగార్జున సాగర్ నియోజకవర్గం కీలక నాయకులు అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు నియోజకవర్గం లో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ రాష్ట్ర కీలక నాయకులతో కూడ చర్చలు జరిపినట్లు తెలిసింది. మరో ఆరు రోజులైతే ఎన్నికల ప్రచారం, ముగుస్తుంది. ఈ సమయంలో అతను కారు దిగి హస్తం గూటికి చేరుతుండడంతో కారుకు బ్రేక్ పడినట్లు అయింది.ఆయన త్వరలో ముఖ్య అనుచరులతోపాటు కలిసి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.యువతతో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.

ANN TOP 10