సందట్లో సడేమియా అంటే ఇదేనేమో. మహారాష్ట్రను గడిచిన మూడునాలుగు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎగ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తాజాగా చివరకు 3 వేల గ్యాస్ సిలిండర్లు సైతం వర్షాలకు కొట్టుకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మహారాష్ట్రను ముంచెత్తుతున్న భారీ వర్షాలు-పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గడిచిన రెండురోజులుగా ఇరాన్-అమెరికా మధ్య వైమానిక దాడులు జరుగుతున్నాయి. కీలక స్థావరాలపై బాంబులు, క్షిపణుల వర్షం కురుస్తోంది. దీంతో ఆయిల్, గ్యాస్‌కు కష్టాలు మొదలయ్యాయి. వంట గ్యాస్ సిలిండర్లకు ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో భద్రంగా వాడుతున్నారు.
నీట మునిగిన హెచ్‌పీసీఎల్ ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్- సీన్ కట్ చేస్తే.. మహారాష్ట్రలో గడిచిన నాలుగైదు రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఫలితంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అంతేకాదు కొండచరియలు విరిగిపడి రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ క్రమంలో రాయగఢ్ జిల్లాలో హెచ్‌పీసీఎల్ పాతాళ్‌గంగ ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్ వరద నీటిలో చిక్కుకుంది.
ఆ వరద ప్రవాహానికి దాదాపు 3వేల వరకు సిలిండర్లు నదిలోకి కొట్టుకువచ్చాయి. భారీ వంతెన వద్ద గ్యాస్ సిలిండర్లు ఆగడం గమనించారు చుట్టు పక్కల స్థానికులు. ఈ మాత్రం ఆలస్యం చేయకుండా వాటికి ఎత్తుకు పోతున్నారు. దొరికిన గ్యాస్ సిలిండర్లలో కొన్ని ఖాళీగా ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే రాయగఢ్ జిల్లా కలెక్టర్ ప్రజలను అలర్ట్ చేశారు. ఒడ్డుకు కొట్టుకొచ్చిన సిలిండర్లను తీసుకెళ్లవద్దని కోరారు.
వరదకు కొట్టుకొచ్చిన గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ ఉందో లేదో చెప్పలేమననారు. వాటి వల్ల ప్రమాదానికి దారితీయొచ్చని హెచ్చరించారు. వాటి గురించి అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. కేవలం మనకు కనిపించింది కేవలం రాయ్‌ఘడ్ జిల్లా మాత్రమే. కనిపించకుండా చాలా పోయాయని అంటున్నారు. మొత్తానికి వరదలు ఏమోగానీ అక్కడి ప్రజలకు గ్యాస్ కష్టాలు రెట్టింపు కావడం ఖాయమనే చర్చ అప్పుడే మొదలైంది.








