AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘మైసా’ కోసం రష్మిక భారీ సాహసం..!

ప్రముఖ కథానాయిక రష్మిక మందన్న తన తదుపరి చిత్రం ‘మైసా’ కోసం ఒక అరుదైన సాహసాన్ని ప్రదర్శించారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఒక కథానాయిక నీటి అడుగున భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేయడం విశేషం. ఈ ఉత్కంఠభరిత ఘట్టాన్ని ఎటువంటి డూప్ సహాయం తీసుకోకుండా రష్మిక స్వయంగా పూర్తిచేయడం గమనార్హం.

 

ఈ విషయాన్ని తెలియజేస్తూ రష్మిక గురువారం సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్‌ను పంచుకున్నారు. “నా కెరీర్‌లో ఇంతకంటే సవాలుతో కూడిన పని ఇప్పటివరకు చేయలేదు. ఈ చిత్రం కోసం మేం ఎంతో శ్రమిస్తున్నాం, ఇదే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది” అని పేర్కొంటూ స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఒక చిత్రాన్ని షేర్ చేశారు. రెండు రోజుల వ్యవధిలో దాదాపు 20 గంటల పాటు నీటి అడుగున ఈ హై-ఇంటెన్సిటీ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్లు చిత్ర బృందం వెల్లడించింది.

 

రవీంద్ర పుల్ల దర్శకత్వంలో ‘మైసా’ చిత్రం ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. గిరిజన నేపథ్యంతో సాగే ఈ కథలో రష్మిక ఒక గోండు గిరిజన యువతిగా అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. “భారతీయ యాక్షన్ సినిమాలలో ఇది ఒక నూతన అధ్యాయం” అని చిత్ర నిర్మాణ సంస్థ అన్‌ఫార్ములా ఫిల్మ్స్ పేర్కొంది. ఈ విశిష్ట పాత్ర కోసం రష్మిక బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా స్టంట్ శిక్షణ కూడా పొందారు.

 

ఈ సినిమా టీజర్ అప్‌డేట్‌ను త్వరలోనే వెల్లడించనున్నట్లు, ఈ ఏడాదే చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ANN TOP 10