AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాములమ్మ రాకతో పద్మక్క గుండెల్లో రైళ్లు.. మైనంపల్లి

రాములమ్మ రాకతో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ( పద్మక్క ) గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మల్కాజ్‌గిరి అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం మెదక్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…‘‘రబ్బరు చెప్పులు, ట్రక్కు డబ్బా నుంచి మంత్రి హరీశ్‌రావుకు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీని ఇంటికి పంపుతాం.

మంత్రి కేటీఆర్ తెలంగాణ నీ జాగిరా..? కేటీఆర్ నీకు మంత్రి పదవి అవసరమా..? పైసలతో ఓట్లు కొనాలని ఈ ఎన్నికల్లో కుట్ర చేస్తున్నారు. మీకు రోజులు దగ్గర పడ్డాయి.ప్రజలను మభ్యపెట్టి సీఎం ఫ్యామిలీ లక్షల కోట్లు సంపాదించారు. పదేళ్లలో ప్రగతి భవన్ టు ఫాంహౌస్‌కు వెళ్లడానికి రూ 800 కోట్లు అప్పనంగా పెట్టారు. వక్ఫ్, అసైన్డ్ భూములకు మంత్రి హరీశ్‌రావు ఎన్ఓసీలు ఇప్పిస్తున్నారు. కమీషన్ల పేరిట కేసీఆర్ ఫ్యామిలీ లక్షల కోట్లు సంపాదించింది. పోలీసులు కాంగ్రెస్ క్యాడర్‌ను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోo’’ అని మైనంపల్లి హన్మంతరావు తీవ్రంగా హెచ్చరించారు.

ANN TOP 10