AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ అంటేనే వణుకుతున్న మహిళలు

లిక్కర్‌ దందాతో మహిళల జీవితాలను నాశనం చేస్తున్న వాళ్లు దీక్ష చేయడం సిగ్గు చేటు
కేసీఆర్‌ బిడ్డకు మహిళా దీక్ష చేసే అర్హతే లేదు
లిక్కర్‌ దందాపై రేవంత్‌ ఎందుకు స్పందించడం లేదు?
‘‘మహిళా గోస ` బీజేపీ దీక్ష’’ లో బీఆర్‌ఎస్‌ నేతలపై నిప్పులు చెరిగిన బండి సంజయ్‌

హైదరాబాద్‌: ‘తెలంగాణలో బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీ జెండాలను చూస్తేనే తెలంగాణ మహిళలు భయపడే పరిస్థితి నెలకొంది. మహిళలపై హత్యలు, అత్యాచారాలు చేసే నేరస్తులను కాపాడే పార్టీలు ఆ రెండు. సినిమాల్లో విలన్లను చూస్తే ఎట్లా పారిపోతారో… ఆ రెండు జెండాలను చూస్తే ఆడవాళ్లు భయపడి ఇంట్లో తలుపులు వేసుకునే దుస్థితి ఏర్పడిరది’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. తెలంగాణలో మహిళా సమస్యలపైనా, మహిళలకు జరుగుతున్న అన్యాయంపైనా, మహిళా బిల్లుపైన ఏనాడూ నోరు మెదపని కేసీఆర్‌ బిడ్డ ఢల్లీిలో దీక్ష చేయడం సిగ్గు చేటని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో, కేసీఆర్‌ కేబినెట్‌ లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా దారుణంగా అవమానిస్తున్న కేసీఆర్‌ బిడ్డకు ఢల్లీిలో దీక్ష చేసే నైతిక అర్హతే లేదన్నారు. పార్టీ సంస్థాగత పదవుల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. మహిళా బిల్లు విషయంలో బీజేపీ చిత్తుశుద్దిని శంకించడం సిగ్గు చేటన్నారు. 1999 నుండి 2003 వరకు అనేకసార్లు పార్లమెంట్‌ లో వాజ్‌ పేయి ప్రభుత్వం మహిళా బిల్లును ప్రవేశపెడితే ఆమోదించకుండా వ్యతిరేకించడమే కాకుండా బిల్లు ప్రతులను సభలోనే చించివేసిన ఎస్పీ, ఆర్జేడీ, ఎంఐఎం పార్టీలతో కలిసి బీఆర్‌ఎస్‌ అంటకాగుతూ దీక్ష చేయడం విడ్డూరమన్నారు. లిక్కర్‌ దందాపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నుండి దారి మళ్లించేందుకే మహిళా దీక్ష పేరిట డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ లిక్కర్‌ దందాతోనైనా మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారో… వాళ్లే మహిళా బిల్లు పేరుత దీక్ష చేయడం వింతలో కెల్ల పెద్ద వింత అని ఎద్దేవా చేశారు.

్న ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ’’మహిళా గోస %–% బీజేపీ భరోసా’’ పేరిట జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సహా పలువురు మహిళా నేతలు దీక్ష చేశారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్‌ తోపాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ కె. లక్ష్మణ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌ రెడ్డి, ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌, మహిళా మోర్చా జాతీయ కార్యవర్గసభ్యులు ఆకుల విజయ, డాక్టర్‌ పద్మ, మాజీ మేయర్‌ కార్తీకరెడ్డి, సులోచన, గీతారాణి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

` కేసీఆర్‌ బిడ్డకు ఢల్లీిలో మహిళా బిల్లుపై దీక్ష చేసే అర్హత లేనేలేదు. మహిళల గురించి మాట్లాడే నైతిక అర్హత లేనేలేదు.
` రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా సీఎం పట్టించుకోకపోవడం, మహిళలకు రాష్ట్రంలో 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదో ప్రశ్నించేందుకే ‘‘మహిళా గోస %–%బీజేపీ భరోసా’’పేరిట దీక్ష చేయడం అభినందనీయం.

` మీకు తెలుసు… రాష్ట్రంలో మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో… వికారాబాద్‌, నిర్మల్‌, కోదాడ లో మైనర్‌ బాలికపైలపై జరిగిన అత్యాచారాన్ని చూశారు… నడిరోడ్డుపై జరుగుతున్న హత్యలు జరుగుతున్నా కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

` కేసీఆర్‌ బిడ్డ ఇయాళ ఢల్లీిలో మహిళా దీక్ష పేరుతో డ్రామా చేయడం సిగ్గు చేటు. నిజంగా చెప్పాలంటే నువ్వు ఢల్లీిలో కాదు… మీ అయ్య ఇంటి ముందు ధర్నా చేసి మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తే బాగుండేది.
` కేసీఆర్‌ బిడ్డకు మహిళలెవరూ అండగా లేరు. బీఆర్‌ఎస్‌ లో మహిళ అంటే కేసీఆర్‌ బిడ్డ మాత్రమే. తెలంగాణ జాగ్రుతి సంస్థలోనే ఇంకో మహిళ కన్పించడం లేదు. ఆమె మహిళా బిల్లు గురించి దీక్ష చేయడం చూసి జనం నవ్వుకుంటున్నారు.
` మహిళా బిల్లుపై మాట్లాడుతున్న కవిత… నిన్న జరిగిన కేబినెట్‌ లో మహిళా బిల్లు గురించి ఎందుకు మాట్లాడలేదు? మేం అధికారంలోకి వస్తే మహిళలకు 33 శాతం టిక్కెట్లు ఇస్తానని ఎందుకు చెప్పలేదు?
` బీఆర్‌ఎస్‌ నాయలకు పార్లమెంట్‌ లో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని ఎందుకు అడగలేదు? సహారా కేసులో, ఈఎస్‌ఐ కేసులో పైసలు దోచుకోవడం, పార్లమెంట్‌ కు డుమ్మా కొట్టడం తప్ప కేసీఆర్‌ సాధించిందేమిటి?
` అంతెందుకు కేసీఆర్‌ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదు? పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఎందుకు ఇవ్వలేదు. సంస్థాగత పదవుల్లో ఎందుకు రిజర్వేషన్లు అమలు చేయడం లేదు?
` మోదీ కేబినెట్‌ లో మొత్తం 11 మంది మహిళలకు చోటు కల్పించారు. తొలి విదేశాంగ మంత్రిగా సుష్మస్వరాజ్‌, తొలి రక్షణ మంత్రి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ కు అవకాశమిచ్చారు. దేశ బడ్జెట్‌ ను మహిళ చేతిలో పెట్టారు. రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళకు అవకాశమిచ్చారు. 8 మంది గవర్నర్లు, 4 రాష్ట్రాలకు సీఎంలుగా మహిళలకు అవకాశం కల్పించాం. ఆర్మీసహా త్రివిధ దళాల్లో మహిళలకు చోటిచ్చాం.
` కేసీఆర్‌ బిడ్డ చేస్తున్న లిక్కర్‌ దందాతో దేశమంతా తలదించుకుంటోంది. రూ.100 కోట్లతో లిక్కర్‌ దందా చేస్తున్న కవిత ఆ దందా సొమ్ముతో మహిళలకు వడ్డీ రుణాలెందుకు ఇప్పించడం లేదు? ఇండ్లులేక అల్లాడుతున్న మహిళలకు ఎందుకు ఇండ్లు ఇప్పించడం లేదు?
` లిక్కర్‌ దందాపై పీసీసీ అధ్యక్షులు ఎందుకు మాట్లాడలేదు? బీఆర్‌ఎస్‌ంబీజేపీ ఒక్కటా? బీఆర్‌ఎస్‌ంకాంగ్రెస్‌ ఒక్కటా? ఆలోచించండి. లంగ, దొంగ దందాలతో కలిసి పనిచేస్తున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలని బండి సంజయ్‌ అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10