AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీకి మరో షాక్‌.. తుల ఉమ రాజీనామా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా వీడుతున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, జి. వివేక్ వంటి కీలక నేతలు పార్టీకి దూరమై కాంగ్రెస్‌లో చేరారు. విజయశాంతి కూడా బీజీపీని వీడి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి మరో కీలక నేత రాజీనామా చేశారు. కరీంనగర్ మాజీ జెడ్పీ ఛైర్‌పర్సన్ తుల ఉమ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపిచారు.

తన రాజీనామాకు గల కారణాలను తుల ఉమ రాజీనామా లేఖలో వివరించారు. ఏ పరిస్థితుల్లో తాను రాజీనామా చేస్తున్నానో లేఖలో వెల్లడించారు. తనను వేములవాడ అభ్యర్థిగా ప్రకటించి.. చివిరి నిమిషంలో అభ్యర్థిని మార్చటం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇది ఓ బీసీ బిడ్డకు జరిగిన అన్యాయమన్నారు. మీ తప్పుడు నిర్ణయాలతో పార్టీని నిరుగారుస్తున్నారని మండిపడ్డారు. అసలు బీ ఫాంలో సరిగా ఇవ్వలేని బీజేపీ బీసీ నినాదంతో ముందుకు వెళ్తానని అనటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ ప్రాంత ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఎమ్మెల్యే టికెట్లు తెంపలేవని.. కాడదాక ఈ జిల్లా ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు.

ANN TOP 10