AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ‘కరెంట్’ సవాల్

తన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే నామినేషన్లు ఉపసంహరించుకోవాడానికి సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట ఎక్కడికి రమ్మన్నా వస్తానని తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని నిరూపించలేకపోతే అమరవీరుల స్థూపం దగ్గర కేసీఆర్ కుటుంబం క్షమాపణ చెప్పాలి. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని నిరూపిస్తే ఏ శిక్షకైనా మేం సిద్ధమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

“హరీష్ రావు వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుకున్నాడు. కానీ అగ్గిపెట్టె కొనుక్కొలేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి దాడిపై ఇప్పటిదాకా రిమాండ్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు. కుట్రలు జరగబోతున్నాయి అని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించాలి. మేటిగడ్డ కుంగిపోయినప్పుడు కూడా కుట్ర జరిగిందని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ కుట్ర అంటాడు. నిపుణుల లోపం వల్లే మేడిగడ్డ కుంగింది అన్నారు. కర్ణాటక రైతుల పేరుతో కొంతమందిని తీసుకువచ్చి డ్రామాకు తెర లేపారు. డీకే శివకుమార్ లెటర్ పేరుతో ఒక కుట్రకు తెర లేపారు. గువ్వల బలరాజే కనిపించిన వాళ్లపై దాడులు చేస్తారు. అసెంబ్లీలో కూడా గువ్వల బాలరాజు ప్రవర్తన అందరూ చూశారు. గువ్వల బాలరాజు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు చెప్తే మా వాళ్లపైనే కేసులు పెట్టారు.” అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

“గువ్వల బాలరాజుపై దాడి అనేది అంతా డ్రామా. ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణం. రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి ఘటనలు. ఏపీలో కోడికత్తి ఘటన, బెంగాల్‌లో మమతా బెనర్జీ కాలి గాయం. ఘటనలే ఇందుకు ఉదాహరణ. కొత్త ప్రభాకర్‌రెడ్డి, గువ్వలపై దాడి ఘటనలు కుట్రలో భాగమే. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసిన నిందితుడిని ఇప్పటివరకు మీడియాకు ఎందుకు చూపలేదు. కొత్త ప్రభాకర్‌రెడ్డి దాడి ఘటన విచారణ వివరాలు బయటపెట్టాలి.ఇప్పటివరకు నిందితుడు రాజు రిమాండ్ రిపోర్టు బయటపెట్టలేదు.” అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

ANN TOP 10