AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అక్కడే అధిక నామినేషన్లు.. అందరి టార్గెట్‌ కేసీఆరే

ఈటల రాజేందర్ గజ్వేల్‌లో పోటీ చేస్తుండగా.. రేవంత్ రెడ్డి కామారెడ్డిలో కేసీఆర్‌ను ఢీకొడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీల్లో బలమైన నేతలుగా ఉన్న వీరిద్దరు.. సీఎంపై పోటీ చేస్తుండడంతో.. ఈ రెండు స్థానాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి శుక్రవారమే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. మొత్తం 5,716 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్‌లో 145 మంది నామినేషన్లు వేశారు. ఆ తర్వాత మేడ్చల్ రెండో స్థానంలో ఉంది. మేడ్చల్‌లో 116 మంది నామినేషన్ దాఖలు చేశారు. కేసీఆర్ పోటీచేస్తున్న మరో స్థానం కామారెడ్డిలో భారీగా నామినేషన్లు వచ్చాయి. అక్కడ మొత్తం 92 మంది బరిలో ఉన్నారు.

కేసీఆర్ బరిలో ఉన్న గజ్వేల్‌లో 145, కామారెడ్డిలో 92 మంది పోటీ చేస్తుండడంతో.. ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కేసీఆర్‌పై మొత్తం 235 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఈటల రాజేందర్ గజ్వేల్‌లో పోటీ చేస్తుండగా.. రేవంత్ రెడ్డి కామారెడ్డిలో కేసీఆర్‌ను ఢీకొడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీల్లో బలమైన నేతలుగా ఉన్న వీరిద్దరు.. సీఎంపై పోటీ చేస్తుండడంతో.. ఈ రెండు స్థానాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ANN TOP 10