AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఖరారు.. 32 స్థానాల్లో జనసేన పోటీ..

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ఛైర్మన్ డా.లక్ష్మణ్ పాల్గొన్నారు. శనివారం రాత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించామని తెలిపారు.

ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశామని తెలిపారు. సుహృద్భావంగా చర్చిస్తున్నామని పేర్కొన్నారు. తాము పోటీ చేసే స్థానాలపై చర్చలు తదిదశకు వచ్చాయని వెల్లడించారు. రెండు స్థానాల విషయంలో ఇంకా తేలాల్సి ఉంది. దీనిపై మరోసారి సమావేశమై మాట్లాడుకుంటామని తెలిపారు. తమ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ అంశాన్ని సమన్వయం చేస్తున్నారని పేర్కొన్నారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన పార్టీ తమకు జీహెచ్ఏంసీ ఎన్నికల్లో ఎంతో సహకరించిందన్నారు. అందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకమైనవి అన్నారు. తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉందని తెలిపారు. జనసేనతో సీట్ల సర్దుబాటు చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని పేర్కొన్నారు. రెండు సీట్ల అంశంపై చర్చించాల్సి ఉందన్నారు.

నవంబర్ 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని తెలిపారు. ఈ సభకు పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించామని పేర్కొన్నారు. డా.లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉందన్నారు.

ANN TOP 10