తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఎల్‌ఆర్ నివాసం, ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగాయి. ఆయనతోపాటు బడంగపేట్ మేయర్ పారిజాత ఇంట్లో కూడా సో దాలు నిర్వహించారు. ప్రస్తుతానికి ఆమె తిరుపతి పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహేశ్వరం కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న కిచెన్నగారి లక్ష్మారెడ్డి నివాసంలో గురువారం ఉదయం నుంచి సోదాలు చేపట్టారు.
ఆయనతోపాటు మరికొందరు కాంగ్రెస్ నేత ల ఇళ్లపై కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్ సహా పది ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. లక్ష్మారెడ్డి ఫామ్‌హౌస్‌లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేపట్టిన ప్రాంతాల్లో అధికారులు భారీగా పోలీసు బం దోబస్తు ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు మహేశ్వరం టికెట్ ఆశించిన బడంగ్‌పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఉదయం 5 గంటల నుంచి అధికారులు మెరుపు దాడులు చేశారు. ప్రస్తుతం పారిజాత నర్సింహారెడ్డి తిరుపతిలో ఉన్నారు. ఆమె భర్త నర్సింహారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. వీళ్లతో పాటు బాలాపూ ర్ లడ్డు వేలం దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి ఇ ంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సో దాల్లో పత్రాలతోపాటు కొంతడబ్బు కూడా దొరికినట్లు తెలుస్తోంది. దాడులు ముగిసి ఐటీ శాఖ వర్గాలు సమాచారం ఇచ్చే వరకు వాస్తవ పరిస్థితి బయటకు వచ్చే అవకాశం లేదు.
దాడులు కుట్రలో భాగమే: చిగురింత
ఐటీ దాడులు రాజకీయ కుట్రలో భాగమేనని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఉన్న ఆమె, ఐటీ సోదాలపై స్పందించారు. తాము లేకపోయినా వెంటనే రావాలని ఐటీ అధికారులు చెప్పడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.









