AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని దుస్తులు లాగి.. లైంగిక వేధింపులు

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ-బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో దారుణం ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు విశ్వవిద్యాలయ విద్యార్థిని దుస్తులు లాగి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆ ఘటనను వీడియో తీశారు. ఈ ఘటన ఆమె వసతి గృహానికి సమీపంలోనే చోటుచేసుకోవడం శోచనీయం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని బుధవారం రాత్రి తన స్నేహితురాలితో కలిసి కర్మన్‌ బాబా ఆలయం వద్ద ఉండగా.. ముగ్గురు దుండగులు బైక్‌పై అటుగా వచ్చారు. బెదిరించి ఓ మూలకు బలవంతంగా లాక్కెళ్లారు. ఆ తరువాత నిందితులు విద్యార్థిని దుస్తులు తొలగించి తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించారు. 15 నిమిషాల తర్వాత బాధితురాలి ఫోన్‌ నంబర్‌ తీసుకొని విడిచిపెట్టారు. తనపై జరిగిన వేధింపుల పర్వంపై బాధితురాలు పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో వందల సంఖ్యలో బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ విద్యార్థులు పెల్లుబికింది. ఆగ్రహాంతో వసతి గృహం వద్ద ఆందోళన చేపట్టారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. క్యాంపస్‌లోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

ANN TOP 10