AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఒడిశా తీరంలో స్పై పావురం

కాళ్లకు కెమెరా, మైక్రో చిప్..
ఒడిశా తీరంలో స్పై పావురం మత్య్సకారుల కంటపడింది. కాళ్లకు కెమెరా, మెక్రోచిప్‌తో తీరంలో పావురం చక్కర్లు కొట్టడాన్ని గమనించారు. ఆ పావురాన్ని పట్టుకుని పారాదీప్ మెరైన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. పావురాన్ని గూఢచర్యం కోసం ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చైనా నుంచి పావురం వచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌లోని పారాదీప్ తీరంలో చిన్న కెమెరా, మైక్రోచిప్‌తో అమర్చబడిన ఓ పావురాన్ని మత్య్సకారులు తమ బోట్లో గుర్తించారు. పావురానికి చిప్, కెమెరా అమర్చి ఉండటాన్ని గమనించిన మత్య్సకారులు..వెంటనే దాన్ని పారాదీప్ మెరైన్ పోలీసులకు అప్పగించారు. పావురాన్ని పరీక్షించిన పోలీసులు..పావురం రెక్కపై కోడ్ నంబర్‌తో మెసేజ్ ఉన్నట్లు గుర్తించారు. పావురాన్ని వైద్యులు పరీక్షిస్తున్నారని.. దాని కాళ్లకు అమర్చిన పరికరాలను పరిశీలించేందుకు రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ సహాయం తీసుకుంటామని జగత్‌సింగ్‌పూర్ ఎస్పీ రాహుల్ తెలిపారు.

పావురం ఎక్కడి నుంచి వచ్చింది.. కాలికి మైక్రో చిప్ అమర్చాల్సిన అవసరం ఏంటీ.. దాని వెనక ఏమైనా ఉగ్రవాద చర్యలు ఉన్నాయా లేక పక్షి పరిశోధన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేశారా అనే పూర్తి వివరాల కోసం విచారణ చేస్తామని వెల్లడించారు ఎస్పీ. ఐటీ విభాగం, పశు సంవర్థక శాఖలతోపాటు అన్ని శాఖల సమన్వయంతో పావురం గుట్టు విప్పుతామని స్పష్టం చేశారు. గూఢచారి పావురం అనే విషయాన్ని కూడా కొట్టివేయలేం అని.. ఆ దిశగానూ విచారణ చేస్తున్నామని తెలిపారు ఎస్పీ రాహుల్.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10