AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్ర ప్రజలకు సీఎం దసరా శుభాకాంక్షలు..

దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరా కు ప్రత్యేక స్థానం వున్నదని సిఎం ఈసందర్భంగా పేర్కొన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశ వ్యాప్తంగా జరుపు కుంటారని సిఎం తెలిపారు.దసరానాడు కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట గుమికూడి సామూహికంగా సంబురాలు జరుపు కోవడం తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని కేసీఆర్‌ తెలిపారు. శమిపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని విజయదశమి పండుగకు ఉన్న విశిష్టతను ప్రత్యేకతను మరొకసారి ప్రజలతో పంచుకున్నారు.

అందరికి విజయాలు కలగాలని..
పోరాడి సాధించుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు, అగ్రపథాన కొనసాగించేందుకు విజయ దశమి స్ఫూర్తితో అలుపెరుగని పోరాటం కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ కు నిత్య విజయాలు కలిగేలా దుర్గామాత కృపాకటాక్షాలు ప్రజలందరి పై వుండాలనీ, ప్రజలందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని సీఎం కేసీఆర్ దుర్గామాతను ప్రార్థించారు.

ANN TOP 10