AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దసరా తర్వాత దూకుడుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాం

దసరా తర్వాత దూకుడుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ఈనెల 27వ తేదీన తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ ఉంటుంది. 31వ తేదీన యూపీ సీఎం యోగీ తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తారు. 28,29 తేదీలల్లో తెలంగాణకు అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ వస్తారు. రాష్టంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చుకుంటాం. ఈసారి ఎన్నికల్లో బలమైన అభ్యర్థులకే టికెట్లు ఇచ్చాం. దసరా తర్వాత బీజేపీ రెండో జాబితాను ప్రకటిస్తాం’’ అని కిషన్‌రెడ్డి ప్రకటించారు.

ANN TOP 10