AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో పెద్దపులి సంచారం.. తీవ్ర భయాందోళనలో ప్రజలు

తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అర్ధరాత్రి లారీ డ్రైవర్లకు రోడ్డుపై పులి కనిపించింది. పెన్ గంగా నదికి అవతల చినార్లి గ్రామ పరిసరాల్లో పులి సంచరించింది. భీంపూర్ మండలంలోని వడూర్, అర్లి-టి, అంతర్గాం గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

ఇటీవల తాంసి-కె, గొల్లఘాట్ పరిసరాలను సందర్శించిన అటవీశాఖ అధికారులు గ్రామస్థులను అప్రమత్తం చేశారు. మహారాష్ట్రలోని టిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పులి వచ్చింది. నదిలో ప్రవాహ ఉద్ధృతి తగ్గడంతో తెలంగాణ వైపు ఆవాసం కోసం పులులు యత్నిస్తున్నాయి.

పంట చేతికి వచ్చే సమయంలో పులుల సంచారం రైతులను కలవపెడుతోంది. మరోసారి బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో పులులు సంచరిస్తూ పశువులను హతమార్చిన వైనం తెలిసిందే.

ANN TOP 10