AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేశంలోకి ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు

ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. శనివారం రుతుపవనాలు క్రియాశీలకంగా మారాయని, వీటి ప్రభావంతో దక్షిణాదిన తమళనాడు ,కేరళ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండి) తెలిపింది. రుతుపవనాల తిరోగమనం వల్ల ఆగ్నేయ ,మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని ఐఎండి వెల్లడించింది. అదే విధంగా కొమెరిన్ ఏరియాపై ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని తెలిపింది. శక్తివంతమైన ఈశాన్య గాలులు దక్షిణ ,మధ్య బంగాళాఖాతంపై బలంగా వీస్తున్నాయని వెల్లడించింది.

ANN TOP 10